అంబంలో ఘనంగా బోనాల పండుగ

రుద్రూర్, బతుకమ్మ: ఆషాడమాసాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో ఆదివారం బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు బోనాలుఎత్తుకొని భాజాభజంత్రీలతో ఊరేగింపుగా గ్రామదేవతల వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. గ్రామంలోని పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పట్టేపు రాములు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.