Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 9:09 pm Posted by : ramakrishna

ఇందూరు ఉషోదయ కళాశాలలో బోనాల సంబరాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం బోనాల పండుగ కన్నుల పండువగా నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థినులంతా పట్టు పరికిణీలు, చీరకట్టు వంటి సంప్రదాయ వస్త్రధారణతో హాజరుకావటం.. బోనాల ఊరేగింపు కార్యక్రమానికి ప్రత్యేక శోభ తెచ్చిపెట్టింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సూర్యప్రకాశ్, డైరెక్టర్ దేవరెడ్డి, ప్రిన్సిపాల్ స్వప్న, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Bona celebrations at Ushodaya College, Indore