శ్రీ సరస్వతి విద్యా మందిర్ లో బోనాల సంబరాలు

భీమ్ గల్, బతుకమ్మ : ఆషాడ మాస ఏకాదశిని పురస్కరించుకొని  పట్టణంలోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు బోనాలు సంబరాలను మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల నుండి విద్యార్థులు,ఉపాధ్యాయ బృందంతో ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పాటలు నృత్యాలు, కోలాట నృత్యాలతో సందడి చేశారు. పాఠశాల విద్యార్థులు అమ్మవారి వేషధారణ, పోతరాజుల వేషధారణ, పోతారాజుల నృత్యాలతో చూపరులను  ఆకట్టుకున్నారు. బస్టాండ్ మీదుగా ఉరిపొలిమేరలో గల పోచమ్మ మందిరం వద్దకు చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు...