హైదరాబాద్ , బతుకమ్మ : హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు గురువారం బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది.దీంతో కోర్టులోని న్యాయవాదులు సిబ్బంది, కక్షిదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టు నుంచి అందరినీ బయటకు పంపి, కోర్టును తమ ఆధీనంలోకి తీసుకన్నారు. బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు జరిపారు. ఇది ఆకతాయిల పని, కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోర్టు కార్యాకలాపాలకు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.