Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 10:34 am Posted by : ramakrishna

ఢిల్లీలోని ఏపీ భవన్‌ని పేల్చేస్తామని బాంబు బెదిరింపు

డిల్లీ, బతుకమ్మ : ఢిల్లీలోని ఏపీ భవన్‌ని బాంబులతో పేల్చేస్తామని ఆగంతకుల మెయిల్ చేశారు.  ఏపీ భవన్‌కు శుక్రవారం రాత్రి ఈబాంబు బెదిరింపు వచ్చింది. ఆడిటోరియంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగుడు ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌కు మెయిల్‌ చేశారు.  భవన్‌లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న తెలుగు రాష్ట్రాల పోలీసులు, ఢిల్లీ పోలీసులతో కలిసి గంటకుపైగా తనిఖీలు చేశారు.