Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 6:08 pm Posted by : ramakrishna

బాన్సువాడలో బాంబుల పేలుడు.. ఆరుగురికి గాయాలు

 

. . . పందుల వేట కోసం నిల్వ ఉంచిన బాంబులు పేలి ఘటన

 

. . . ఇద్దరి పరిస్థితి విషమం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎర్రమన్ కచ్చా ప్రాంతంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. దాసరి లక్ష్మయ్య ఇంటి వద్ద మోపెడ్‌లో పందుల వేట కోసం నిల్వ ఉంచిన బాంబులు ఒక్కసారిగా పేలడంతో తీవ్ర కలకలం రేగింది.ఈ ఘటనలో దాసరి లక్ష్మయ్యతో పాటు మరో ఐదుగురు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి గాయపడిన వారిని వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాంబులు అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు నిల్వ ఉంచారు? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ పేలుడు ఘటనతో ఎర్రమన్ కచ్చా ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Bomb blasts in Banswada; six people injured
Bomb blasts in Banswada; six people injured