గర్గుల్ లో కలకలం రేపిన బాంబు పేలుళ్లు

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి.ఈఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  గ్రామ శివారులోని మొగుళ్ల సాయ గౌడ్ కు చెందిన పొలంలో బాంబు పేలడంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. భారీ శబ్దం , పొగ రావడంతో చుట్టుపక్కలున్న రైతులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తమ పొలాల్లో బాంబులు వేసి వెళ్లారని రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. బాంబుల భయంతో కూలీ పనివారు ఎవరు కూడా పనికి రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ...