Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2025, 11:47 am Posted by : ramakrishna

సంచిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

నవీపేట్, బతుకమ్మ  :  నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సంచిలో లభ్యమైంది. ఈ సంఘటన శుక్రవారం గ్రామస్తుల ద్వారా వెలుగు చూసింది. నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామ శివారులోని గుట్ట వద్ద 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల యువకుడి మృతదేహం సంచిలో ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నవీపేట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. సంచిలో పూర్తిగా కుళ్లి పోయి ఎముకల గూడు, బట్టలు మాత్రమే మిగిలాయి. గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ తెలిస్తే గాని కేసు కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఇటీవల కాలంలో జిల్లాలో మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు పోలీసులు. గుర్తుతెలియని వ్యక్తులు యువకుడి ని హత్య చేసి ఆనవాళ్లు గుర్తించకుండా ఉండేందుకు సంచిలో కట్టి మృతదేహాన్ని గుట్టలలో పారవేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఘటన స్థలాన్ని నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ పరిశీలించి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.