నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నగరంలోని 3వ టౌన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. ఈ నెల 14న నాందేవ్ వాడలోని తిరుమల వైన్స్ ఎదుట గల రోడ్డు ప్రక్కన ఓ గుర్తు తెలియని వ్యక్తి పడిపోవడంతో ఓ వ్యక్తి అంబులెన్స్ లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతి చెందిన వ్యక్తి నల్లనిషర్టు ధరించి, కోలమొహం కలిగి ఉన్నాడని, సుమారు 35-40 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందన్నారు. ఎవరైనా గుర్తు పడితే సంబంధిత 3వ పోలీ స్ స్టేషన్ కు లేదా 8712659839, 8712659717కు సమాచారం ఇవ్వాలని కోరారు.