- గడ్కోలు వాసిగా గుర్తింపు
భీమ్ గల్, బతుకమ్మ
మండల కేంద్రంలోని ధర్మరాయుని కుంట సమీపంలోని పొలంలో ఓ శవం పడిఉందని ఎస్సై మహేష్ తెలిపారు. మృతుడు సిరికొండ మండలం గడ్కోలు గ్రామవాసిగా గుర్తించినట్లు ఎస్సై వివరించారు. మృతుడు సూర సిద్ది రాములుగా (48)గా గుర్తించారు. ఈ వ్యక్తి ఇటీవలే తప్పిపోయాడాని సిరింకొండ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయి ఉన్నట్లు ఆయన తెలిపారు.మృతుడు సిద్ది రాములు మరణానికి కారణాలు తెల్వకపోగా మరణ కారణం తెల్సుకొనేందుకు పోలీసులు శవ పంచానామా నిర్వహిచి, పోస్ట్ మార్టం నిమిత్తం ఆర్మూర్ కు పంపించిన్నట్లు ఎస్సై తెలిపారు.