బోధన్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం
బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం తాత్కాలికంగా మూతపడింది. కార్యాలయం భవన యజమానులు 36 నెలలుగా నెలకు రూ. 74 వేల చొప్పున మొత్తం రూ. 26 లక్షల వరకు అద్దె చెల్లించకపోవడంతో ఆగ్రహంతో గురువారం తాళం వేశారు. యజమానుల బకాయిపై సబ్ రిజిస్టర్ సాయినాథ్ ను వివరణ కోరగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని యజమానులతో మాట్లాడి తెరిపించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీంతో రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రభుత్వ...