Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 4:34 pm Posted by : ramakrishna

కల్లూర్ పాఠశాలను సందర్శించిన బోధన్ సబ్ కలెక్టర్

పోతంగల్, బతుకమ్మ : పోతంగల్ మండలంలోని  కల్లూర్ గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలను శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు.

Bodhan Sub Collector who visited the Kallur school

ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని సూచించారు. మెనూ ప్రకారం మధ్యాహన్న భోజనం అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి చదువుపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Bodhan Sub Collector who visited the Kallur school