పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో

  బోధన్, బతుకమ్మ  :   బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్ ప్రాంతంలో ఉన్న విజేత జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు నెం. 97, 98, 99 లను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను ఆయన సమీక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా కొనసాగుతోందని అధికారులు సబ్ కలెక్టర్‌కు వివరించారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలపై సబ్...