Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 12:11 pm Posted by : ramakrishna

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో

 

బోధన్, బతుకమ్మ  :

 

బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్ ప్రాంతంలో ఉన్న విజేత జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు నెం. 97, 98, 99 లను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను ఆయన సమీక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా కొనసాగుతోందని అధికారులు సబ్ కలెక్టర్‌కు వివరించారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలపై సబ్ కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.