Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 7:18 pm Posted by : ramakrishna

బోధన్ సబ్ కలెక్టర్ సమీక్షా సమావేశం

బతుకమ్మ బోధన్ : బోధన్: నియోజకవర్గ తహసీల్దార్లతో సబ్ కలెక్టర్ గారు నియంత్రణ పట్టిక మ్యాపింగ్ మరియు ఓటర్ల డేటా మ్యాపింగ్‌ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న తహసీల్దార్లను, తమ మండలాల్లో బీఎల్ఓలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఓటర్ల డేటా మ్యాపింగ్‌కు సంబంధించిన విధానాలపై బీఎల్ఓలకు సమగ్ర మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచించారు. అదనంగా, ఆయన పీఎస్ వారీగా 2002 ఓటర్ల స్థిర నివేదికలను సమీక్షించి చర్చించారు.