Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 1:22 pm Posted by : ramakrishna

ఏసీబీ కి  చిక్కిన బోధన్ ఎస్ ఐ

 

. . . రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

 బోధన్, బతుకమ్మ:

లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు బోధన్  ఎస్ఐ 1 భాస్కర చారీ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా  బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ 1 పనిచేస్తున్న బాస్కర చారి ఒక వ్యక్తి నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ రెంజ్ ఎసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు.

Bodhan SI caught by ACB

ఒక సివిల్ వివాదానికి సంబంధించిన విషయంలో లేదా పాత కేసులో సెక్షన్ మార్పు కోసం ఈ లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఆయనపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఉన్నతాధికారుల ప్రమేయం పై విచారణ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా లో వర్ని ఎస్ఐ ఏసీబీకి దొరికిన తర్వాత మరో ఎస్ఐ అవినీతి కేసులో పట్టుబడటం తోలిసారి.

Bodhan SI caught by ACB
ఎసిబికి చిక్కిన బాస్కర చారీ ( పైల్ పోటో)