పంట నష్టం పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
వరి, సోయా పంటలు నీటమునిగి రైతుల నష్టంపై ఆవేదన బతుకమ్మ బోధన్ : బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలో కురిసిన భారీ వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహించడంతో ఖాజాపూర్, హుంసా, మందర్న గ్రామాల పరిసరాల్లో వేల ఎకరాల్లో వరి, సోయా పంటలు మునిగిపోయి నాశనం అయ్యాయి. ఈ నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మంగళవారం ప్రభావిత గ్రామాలను సందర్శించి, పంట పొలాలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు. ఎమ్మెల్యే...