Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 7:16 pm Posted by : ramakrishna

ఉమ్మడి జిల్లాలో ఉత్తమ డివిజన్ గా బోధన్

  • డిఈతో పాటు ఏడిఈ, ఏఈలకు సన్మానం

 

బోధన్, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాలో ఉత్తమ పనితీరు లో ప్రతిభ కనబరిచిన డివిజన్లకు సబ్ డివిజన్లకు సెక్షన్లకు ప్రతి నెల  కంపెనీ స్థాయిలో , ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన డివిజన్లకు సబ్ డివిజన్లకు సెక్షన్లకు ర్యాంకింగ్ పద్ధతిలో ఎంపిక చేసి సీఎం డి వరుణ్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డివిజన్ బోధన్ డివిజన్ , ఉత్తమ ప్రతిభ కనబరిచిన సబ్ డివిజన్ రుద్రూర్ సబ్ డివిజన్ ఎంపిక చేయబడ్డాయి. మంగళవారం బోధన్ డివిజన్ సమీక్ష సమావేశంలో ఎండి ముక్తార్ రుద్రూర్ సబ్ డివిజన్ ఏడిఈ తోట రాజశేఖర్, సబ్ డివిజన్ ఏఇలు బుజ్జిబాబు, ఫక్రుద్దీన్, గోపి, గిరిధర్, బాలకిషన్ లను సన్మానించి అభినందించారు.  ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ మన అందరం కష్టపడి పనిచేసి మన డివిజన్, మన సబ్ డివిజన్లను, సెక్షన్లను కంపెనీ స్థాయిలో మొదటి స్థానానికి తీసుకురావాలన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు నిరంతరం పనిచేస్తున్న కార్మికులను అభినందించారు. సమీక్షా సమావేశంలో ఏడిఇ లు ప్రభాకర్, కే నగేష్ కుమార్, ఏఈలు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.