శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రత్యేక పూజలు

బతుకమ్మ, బోధన్ : ఎడపల్లి మండలంలోని ప్రసిద్ధ జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయిశివ శనివారం తన బంధుమిత్రులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం తొలి శనివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం చారిత్రక ప్రాధాన్యం కలిగిన పవిత్ర క్షేత్రమని పేర్కొన్నారు. ఈ ఆలయం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ప్రతి...