మంజీరా నదిలో బోధన్ సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
మంజీరా నది ప్రాంతం అంతా గప్ చూప్ పోతంగల్, బతుకమ్మ : పోతంగల్ మండల పరిధిలోని హంగర్గా మంజీరా నుండి రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు పక్క సమాచారం రావడంతో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో గురువారం మంజీరా నది ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠినమైన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. సబ్ కలెక్టర్ తనిఖీలు నిర్వహించడంతో మంజీరా నది ప్రాంతం అంతా గప్ చూప్ గా మారింది.