ముఖ్యమంత్రిని కలిసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : శనివారం హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మాజీ మంత్రి, ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి , రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తో పాటు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.