Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2025, 1:54 pm Posted by : ramakrishna

టీజీ డీఈఈసెట్ సందర్భంగా బీఎన్ఎస్ఎస్ 163 అమలు

సీపీ సాయి చైతన్య

నిజామాబాద్, బతుకమ్మ : డివిజన్ వ్యాప్తంగా టీజీ డీఈఈసెట్ – 2025 ఎంట్రన్స్ పరీక్ష సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద అండర్ సెక్షన్ 163  బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నామని సీపీ సాయి చైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఆదివారం జరిగే ఈ ఎంట్రన్స్ పరీక్షకు ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ డివిజన్ లో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.