18న బీఎన్ఆర్ కేఎస్ మహాసభ
ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఈనెల 18వ తేదీన కామారెడ్డి లోని తాహిర్ గార్డెన్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం నాల్గో మహాసభలను నిర్వహించనున్నట్లు సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్, జిల్లా కన్వీనర్ పయ్యావుల శ్రీనివాస్ తెలిపారు. రాష్ర్ట వ్యవస్థాపక అధ్యక్షుడు కమల ఐలన్న ఆదేశాల మేరకు మహాసభలను వాల్ పోస్టర్లను ఎల్లారెడ్డిలో బుధవారం కార్మిక నాయకులు, కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్ మాట్లాడుతూ.. మహాసభల్లో ప్రతి కార్మికుడు పాల్గొనాలని కోరారు. జిల్లా కో...