Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2024, 2:39 pm Posted by : ramakrishna

18న బీఎన్ఆర్ కేఎస్ మహాసభ

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఈనెల 18వ తేదీన కామారెడ్డి లోని తాహిర్ గార్డెన్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం నాల్గో మహాసభలను నిర్వహించనున్నట్లు సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్, జిల్లా కన్వీనర్ పయ్యావుల శ్రీనివాస్ తెలిపారు. రాష్ర్ట వ్యవస్థాపక అధ్యక్షుడు కమల ఐలన్న ఆదేశాల మేరకు మహాసభలను వాల్ పోస్టర్లను ఎల్లారెడ్డిలో బుధవారం కార్మిక నాయకులు, కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్ మాట్లాడుతూ.. మహాసభల్లో ప్రతి కార్మికుడు పాల్గొనాలని కోరారు. జిల్లా కో కన్వీనర్లు బ్రహ్మ రెడ్డి, అబ్దుల్ రజాక్, సీనియర్ నాయకులు లక్ష్మణ్, ధ్యానబోయిన శ్యామ్, పి.సాయిలు, బాలయ్య, శ్రీను, సతెల్లి చంద్రయ్య, మొహమ్మద్ తోఫిఖ్, మహమ్మద్ అజ్మలుద్దీన్, కాంతారావు, రామ్మోహన్ రావు అమృత్రావు  కుసులకంటి సాయిలు, రోహిత్ కుమార్, మొహమ్మద్ తాజ్, ముజ్జు, జునైద్, అలీ, తదితరులు పాల్గొన్నారు.