కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుండడంతోపాటు పట్టణం వేగంగా విస్తరిస్తున్న నేపత్యంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం, నేరాల నియంత్రణ కోసం ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా బ్లూ కోల్ట్స్ సిబ్బిందిని నియమించినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ట్రాఫిక్ పెట్రోలింగ్ మోటార్ సైకిళ్లు, అశోక్ నగర్, స్నేహపురి కాలనీ, శ్రీరామ్ నగర్, వివేకానంద కాలనీ, శ్రీనివాస్ నగర్, తదితర కాలనీలను కలుపుకొని ఒక బ్లూకోల్ట్ రెండు షిఫ్టుల్లో 24గంటల పాటు అందుబాటులో ఉంటుందని సీఐ తెలిపారు. పట్టణ ప్రజలు బ్లూకోల్ట్ సేవలను వినియోగించుకోవాలని పోలీసులకు సహకరించాలని కోరారు.