- అక్టోబర్ 11,12 న సభల నిర్వహణ
- బహుజన బీడీ కార్మికులందరు హాజరై సభలను విజయవంతం చెయ్యాలి
- బీఎల్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్.సిద్దిరాములు
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : బీడీ పరిశ్రమకు పుట్టినిల్లు అయినా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం (బీ ఎల్ టీ యూ) రెండవ రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్లు బీ ఎల్ టీ యూ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్. సిద్ది రాములు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లోని బీ ఏల్ టీ యూ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ రాష్ట్ర మహాసభలను నర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మహాసభల నిర్వహణలో భాగంగా అక్టోబర్ 11న మొదటి రోజు మధ్యాహ్నం 1 గంటకు పట్టణంలోని తిలక్ గార్డెన్ నుండి పాత కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ, మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభకు రాష్ట్ర గ్రామీణభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.అక్టోబర్ 12 న రెండవ రోజు తిలక్ గార్డెన్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఉదయం 10 గంటలకు ప్రతినిధుల మహాసభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి అతిథులుగా కా,నల్ల సూర్య ప్రకాష్, బిఎల్ ఎఫ్,చ్తెర్మన్,గౌ,జయరాజ్, పకృతి కవి,రచయిత, గౌ,ఏపూరి సోమన్న,బహుజన యుద్ధ నౌక ,జుపక ,సుభద్ర కవి,రచయిత, వక్తలు గా దండి వెంకట్ బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు, యం,ఆంజనేయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నగరపు యెల్లయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు,యస్.స్తెయ్యద్ రాష్ట్ర కోషదికారి, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం,సబ్బని లత,బహుజన లెప్ట్ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు,మంత్రి సుదర్శన్ రాష్ట్ర అధ్యక్షులు, తిరుపతి గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడ్ల రాజు సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, బాస్కర్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, తెలంగాణ బహుళ జన బీడీ టేకేదార్ యూనియన్, బి,జగదీష్ నిజామాబాదు జిల్లా అధ్యక్షులు, చట్ల పొశవ్వ నిర్మల్ జిల్లా అధ్యక్షులు, కే,శ్రీ హరి జిల్లా అధ్యక్షులు, బి,నర్సిములు జిల్లా కార్యదర్శి, సిద్దిపేట జిల్లా గంగా మణి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుమ్మరి రవి,కామారెడ్డి జిల్లా కార్యదర్శి యం, ప్రభాకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు రోహిణి, మెదక్ జిల్లా అధ్యక్షురాలు యం, రాజేంద్రర్ బిఎల్ టీయూ నిజామాబాదు జిల్లా అధ్యక్షులు, సి,హెచ్,రాజు సిరిసిల్ల జిల్లా కార్యదర్శి, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, వడ్ల సాయి కృష్ణ, బిడియస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, తదితరులు హాజరు అవుతారన్నారు. ఈ సభను జయప్రదం చేయాలని కార్మిక వర్గంఆయన విజ్ఞప్తి చేశారు. గత రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, తెలంగాణ రాష్ట్రములోని బీడీ కార్మికులు ఎదురు కుంటున్న అనేక సమస్య ప్తె ,రాజీలేని పోరాటం చేయడం జరిగిందని, చేసిన పోరాటాలను ఉద్యమాలను సమిక్షించుకోని,భవిషత్ ఉద్యమ కర్తవ్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భాలలో బీడీ కార్మికుల అందరికీ రూ.4016ల, జీవన భృతి ఇస్తామని, బీడీ కార్మికుల ఓట్ల తో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి రెండు సంవత్సరాలు అవుతున్న బీడీ కార్మికులకు ఇవ్వలేదని, 2014 పిబ్రవరి 28 కటాప్ తేదిని తొలగించలేదని,కేంద్రం ప్రభుత్వం ఈ పీ ఎఫ్ పెన్షన్ పెంచిన 3000/-ఇవ్వడం లేదన్నారు. బీడీ పరిశ్రమ ప్తె లేని పోని ఆంక్షలు పెట్టి బీడీ పరిశ్రమ ప్తెబిజిస్ట్ 28% నుండిcనేడు 40%కు పెంచడం జరుగుతుందన్నారు. దిని ద్వారా బీడీ కార్మికులు మరింత ఉపాది దెబ్బ తినడం కోసం బౌళ జాతీయ కంపనీలతో కేంద్రం ప్రభుత్వం కుమ్ముక్తె బీడీ కార్మికుల కు ఉపాది లేకుండా చేస్తుందన్నారు. ఇట్టి విషయాల ప్తె మరింత పోరాటం చేయడం కోసం ఈ అక్టోబర్11,12,తేదీల్లో నిజామాబాదు జిల్లా కేంద్రం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర రెండవ మహా సభలుకు వేల సంఖ్యలో బీడీ కార్మికుకులు పాల్గొని సభలను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రెస్ మీట్ లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర కోషదికారి యస్. డి.స్తెయ్యద్, తెలంగాణ బహుళ జన బీడీ టేకేదార్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మంత్రి సుదర్శన్, జిల్లా నాయకులు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.