బీఎల్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బీఎల్టీయూ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్ ను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ దిలీప్ కుమార్ శుక్రవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఎల్టీయూ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడమే కాకుండా, ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చిన మహనీయుల జయంతులు వర్ధంతులతో ముద్రించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి...