బాల్కొండ,బతుకమ్మ: బాల్కొండ మండల కేంద్రంలో కేసీఆర్ కాలనీలోని రెండు పడకల గదుల ఇండ్లలో స్లాబ్ పెచ్చులు ఊడి పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న మోహన్ అనే వ్యక్తి కుమార్తె ప్రీతికపై స్లాబ్ పెచ్చులు ఊడిపడి బాలికకు స్వల్ప గాయాలు అయ్యాయి. డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి రెండు సంవత్సరాలు కాకముందే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత ఎలా ఉంటుందో అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి ఇటువంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు.
