Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 4:57 pm Posted by : ramakrishna

నెత్తురోడిన జాతీయ రహదారి

 

. . . కార్ ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనదారులపై నుంచి దూసుకెళ్లిన కంటైనర్

 

. . . ఇద్దరు స్పాట్ లోనే దుర్మరణం

 

డిచ్ పల్లి , బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి నెత్తురోడింది. 44వ నెంబర్ నేషనల్ హైవే పై డిచ్ పల్లి వద్ద కారును వెనుక నుంచి బుల్లేట్ బండి ఢీ కొట్టి ఇద్దరు మోటార్ సైక్లిస్ట్ లు కిందపడ్డారు.

 

Bloody national highway

 

వారి పై నుంచి వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ దూసుకెళ్లి, కొంత దూరం ఇడ్చుకేళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బుల్లేట్ బండిపై ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది.

 

Bloody national highway

 

ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు వాహనాలను దారీ మళ్లించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడీలను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది….

 

Bloody national highway