విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ టెస్టులు
ఇందల్వాయి,బతుకమ్మ: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఉచిత బ్లడ్ గ్రూపు టెస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు హెడ్మాస్టర్ లక్ష్మీనాథం ప్రోత్సాహంతో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. హెడ్మాస్టర్ లక్ష్మీనాథానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం రాధిక, వైద్య పరీక్షల బృందం, అంగన్ వాడీ, హెల్త్ వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.