రక్తదాన శిబిరం ఏర్పాటు

  రుద్రూర్, బతుకమ్మ :   సద్గురు స్వామి సమర్థ మహారాజ్ (దుబ్బాక) వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయాలల్లో స్వామి వారికి సింధూర అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది యువకులు, స్వామి వారి భక్తులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు....