Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 May 2025, 6:28 pm Posted by : ramakrishna

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నందిపేట్, బతుకమ్మ: భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రతినిధులు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినంగా గుర్తించడంతో పాటు, దేశ భద్రత, శాంతి, సామరస్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.