లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రుద్రూర్ ఎస్సై పి.సాయన్న హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరంలో 22 యూనిట్ల రక్తాన్ని సేకరించి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ బోధన్ వారికి అందించడం జరిగింది. గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులో రక్తపు నిలువలు పూర్తిగా లేనందున వారి కోరిక మేరకు అత్యవసరంగా ఈ క్యాంప్ ను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి వారికి అందజేయడం...