అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం

బతుకమ్మ, బోధన్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల-2025లో భాగంగా మంగళవారం సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో బోధన్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీ, పోలీస్‌శాఖ సంయుక్తంగా  నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్‌ త్యాగమూర్తులను స్మరించుకుంటూ అధికారులు, సిబ్బంది రక్తదానంలో పాల్గొన్నారు. పలువురు పోలీస్‌ అధికారులు, సిబ్బంది, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. పోలీస్‌ సిబ్బంది సేవా భావం ప్రజలకు ఆదర్శమని నిర్వాహకులు తెలిపారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది,...