నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రముఖ యువ వ్యాపారవేత్త సమాజ సేవకుడు పొలిటికల్ అనలిస్ట్ గా ప్రసిద్ధి చెందిన డా. పడకంటి రాము పుట్టినరోజు సందర్భంగా ఖలీల్ వాడీ లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో, ప్రభుత్వ హాస్పిటల్ తదితర వైద్య సేవల స్థలాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యవసరమున్న వారికి, తలసేమియా రోగుల కోసం పలువురు రాము అభిమానులు, మిత్రులు రక్తదాతలు వచ్చి రక్త దానం చేశారు.

ఈ కార్యక్రమం విజయవంతం చేయటంలో సమాజ సేవకుడు పురుషోత్తం రెడ్డి, జర్నలిస్ట్ కట్ట సతీష్, సంపత్ తదితరులు ప్రముఖ పాత్ర వహించి తమ మిత్రుడు రాము పై అభిమానాన్ని చూపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావటంలో పాత్ర పోషించిన వారందరికీ, తనను ఆశీర్వదించిన జిల్లా ప్రజలందరికీ డా. పడకంటి రాము ధన్యవాదాలు తెలియచేశారు.
