Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 8:09 pm Posted by : ramakrishna

టీయూ సౌత్ క్యాంపస్ లో రక్తదాన శిబిరం

బతుకమ్మ భిక్కనూరు: బిక్కనూరు మండల కేంద్రంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ టీయూ సౌత్ క్యాంపస్ ఎకో క్లబ్,  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాకు చెందిన డా. రోనాల్డ్ రోస్ హెల్త్ సొసైటీ బ్లడ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రక్తదానం పై ‘ప్రాణాలను కాపాడు – వీలైతే ఎక్కువమందికి అవగాహన కల్పించు’ అనే లక్ష్యంగా చేసుకొని రక్తదాన శిబిరాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడవచ్చునని గుర్తు చేశారు. రక్తదానం యొక్క విశిష్టతను విద్యార్థులకు కూలంకుషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. రాజేశ్వరి, రోనాల్డ్ రోస్ సంస్థ సెక్రటరీ వినోద్ ఉపాధ్యక్షుడు రామచందర్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ లలిత, డాక్టర్ హరిత, డా.మోహన్ బాబు,డా.అంజయ్య, డాక్టర్ యాలాద్రి, డా.నారాయణ, డా.నర్సయ్య, డా.వైశాలి, డా.రమాదేవి, డా.ఇంద్రకరణ్ రెడ్డి, దిలీప్, విద్యార్థులు పాల్గొన్నారు.