రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో రక్తదానం
రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందచేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరపున రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించగా, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు వివిధ శాఖలకు చెందిన సుమారు 60 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. తలసేమియా పేషెంట్ల...