కాంగ్రెస్ భవన్ లో రక్త దాన శిబిరం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఆదివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ వారి సహకారంతో నిర్వహించిన ఈ రక్త దాన శిబిరంలో పెద్ద ఎత్తున యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదానం చేసారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మేయర్ ఉమారాణి, డీసీసీ...