ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
రుద్రూర్, బతుకమ్మ : పదవుల కోసం కాదు.. ప్రజా సేవ కోసమే ఎన్నికల బరిలో నిలిచానని రుద్రూర్ మండలం అంబం(ఆర్) గ్రామ సర్పంచ్ అభ్యర్థి షేక్ అఫ్సర్ అన్నారు. గ్రామస్తులు ఒకసారి అవకాశం కల్పిస్తే, గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, గ్రామ రూపురేఖలు మారుస్తానని ఓటర్లకు వివరించారు. గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు...