Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 3:02 pm Posted by : ramakrishna

 ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

రుద్రూర్,  బతుకమ్మ : పదవుల కోసం కాదు.. ప్రజా సేవ కోసమే ఎన్నికల బరిలో నిలిచానని రుద్రూర్ మండలం అంబం(ఆర్) గ్రామ సర్పంచ్ అభ్యర్థి షేక్ అఫ్సర్ అన్నారు. గ్రామస్తులు ఒకసారి అవకాశం కల్పిస్తే, గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, గ్రామ రూపురేఖలు మారుస్తానని ఓటర్లకు  వివరించారు. గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని కోరారు.  గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అంబం గ్రామ పంచాయతీ పరిధిలోని గజ్జెలమ్మ గుడి వరకు రోడ్డు వేయించడానికి కృషి చేస్తానని, గ్రామ పంచాయతీలో ఉన్న పురాతన దేవాలయాలను పునర్మిర్మాణానికి, అన్ని దేవాలయాలకు ధూపదీప నైవెద్యములు నిర్వహించడంతో పాటు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా బోనాలను, బతుకమ్మ పండుగను నిర్వహించుట, అంబం గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలందరికి తాగునీరు (ఫిల్టర్ వాటర్) సౌకర్యం ఉచితం. గ్రామంలో ఏ కుటుంబంలోనైన బంగారుతల్లి (ఆడపిల్ల) జన్మిస్తే 5,000/- కానుక. అంబం గ్రామ పంచాయతీలో ఏ కుటుంబంలోనైన ఆడపిల్ల పెళ్ళికి ఆడపడుచు కానుక 5,111/- రూపాయిలు. అంబం గ్రామ పంచాయతీలో వృద్ధాప్యంలో ఉన్న ఒంటరి మహిళలు, పురుషుల కోసం ఆసరా నిలయం (నివాస) వసతి ఏర్పాటు. గ్రామ పంచాయతీలో నిరుద్యోగ ఆడపడుచుల కోసం నిరంతర 20 కుట్టుమిషన్లతో టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్, డ్వాక్రా గ్రూప్ వాళ్లకు ఉపాధి అవకాశం కోసం యూనిట్ సెంటర్ల ఏర్పాటు చేయిస్తానని ఇలా మొత్తం 15 హామీలతో రూపొందించిన మేనిఫెస్టోను ఆయన ప్రకటించారు. అంబం గ్రామ ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఎన్నికల సందర్భంగా తెలిపిన మేనిఫెస్టోలోని ప్రతి  అంశాన్ని తూచా తప్పకుండా అమలుపరుస్తానని ఆయన అన్నారు.

Bless me.. I will develop.