బ్లాక్.. వైట్ అయ్యేదెన్నడో..?
39 రైస్ మిల్లులు బ్లాక్ లో రెవిన్యూ రికవరి యాక్ట్ లో తేలనేలేదు కొత్త బియ్యం పాలసీ కోసం మిల్లర్ల ఒత్తిడి బ్లాక్ లిస్టు నుంచి తొలగించాలని మిల్లర్ల ప్రయత్నాలు నిజామాబాద్ ,బతుకమ్మ: తెలంగాణ జిల్లాలో అత్యదికంగా వరి పండించే జిల్లాలో మిల్లర్లు వానాకాలం సీజన్ దాన్యం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రాష్ర్టంలో ధాన్యం ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉండగా సీయంఆర్ పక్కదారి పట్టడంలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 220 కోట్ల ధాన్యం పక్క...