- 39 రైస్ మిల్లులు బ్లాక్ లో
- రెవిన్యూ రికవరి యాక్ట్ లో తేలనేలేదు
- కొత్త బియ్యం పాలసీ కోసం మిల్లర్ల ఒత్తిడి
- బ్లాక్ లిస్టు నుంచి తొలగించాలని మిల్లర్ల ప్రయత్నాలు
నిజామాబాద్ ,బతుకమ్మ: తెలంగాణ జిల్లాలో అత్యదికంగా వరి పండించే జిల్లాలో మిల్లర్లు వానాకాలం సీజన్ దాన్యం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రాష్ర్టంలో ధాన్యం ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉండగా సీయంఆర్ పక్కదారి పట్టడంలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 220 కోట్ల ధాన్యం పక్క దారి పట్టిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 39 రైస్ మిల్లులను బ్లాక్ పెట్టారు అధికారులు. కోటగిరి పోలిస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. నిజామాబాద్ రూరల్, బోదన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని రైస్ మిల్లర్లు కోట్ల విలువ చేసే ధాన్యంను మర అడించకుండానే బహిరంగంగా అమ్ముకున్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వంలో ఆరోపణలు రాగా కోత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం సీయంఆర్ పక్కదారి పట్టించిన వారిపై తోలుత సీరియస్ గానే ఉంది. కేసులు నమోదు చేసి రెవిన్యూ రికవరి యాక్టుకు సిద్ధపడింది. ఇద్ధరు అధికారులపై వేటు వేసింది. అంతవరకు సవ్యంగానే జరిగింది. కాని ఇటివల కాలంలో బ్లాక్ లీస్టులో ఉన్న రైస్ మిల్లులను అ జాబితాలోనుంచి తోలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు గుసగుసలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఓక ప్రజా ప్రతినిధి ప్రధాన అనుచరుడు ఒ కార్పోరేషన్ చైర్మెన్ చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా రైస్ మిల్లర్ ల సంఘం నేతతో లోపాయికారిగా ఒప్పంధం కుదుర్చుకున్నట్లు అంతా గుసగుసలు వినిపిస్తున్నాయి. సధరు ప్రజా ప్రతినిధి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్ని మిల్లులలో దాన్యం పక్కదారి పట్టడం తన ప్రధాన అనుచరుడికి రైస్ మిల్ దందా ఉండటంతో బ్లాక్ లీస్టులో ఉన్నవాటిని తోలిగించే ప్రక్రియను ఎత్తుకున్నట్లు ప్రచారం జరగుతుంది. జిల్లాలో 11,94,154 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉంది. అందులో సన్నాలు 1,04,959 మెట్రిక్ టన్నులలో, 1,89,184 దోడ్డు రకం దాన్యం అని లెక్కలు కట్టారు. మిల్లింగ్ కు వచ్చే సరికి 8లక్షల 79 వెల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం, 1లక్ష 5 వెల మెట్రిక్ టన్నుల దోడ్డు రకం ధాన్యం మిల్లులకు వస్తుందని అంచానా ఉంది. ఇటివల వానకాలం సంబంధించిన దాన్యం కేటాయింపు పై మిల్లర్లు చర్చ ప్రారంభమయ్యాయి. రాష్ర్టంలో కోత్త ధాన్యం సెకరణ, సీయంఆర్ పాలసీపై మిల్లర్లు ప్రధానంగా ప్రభుత్వానికి కోత్త డిమాండ్ పెట్టినట్లు తెలిసింది. గతంలో మాధిరిగా కాకుండా సన్నరకాలను మర అడించాలంటే క్వింటాళ్ కు గత సీజన్ లో ఇచ్చినట్లు తరుగు ఇవ్వడం కుదరదని పేచిపెడుతున్నట్లు తెలిసింది. అందులో నిజామాబాద్ జిల్లా మిల్లర్ నేతలు అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా సీయంఆర్ విషయంలో బ్లాక్ లీస్టులో ఉన్న మిల్లర్లను అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. రైస్ మిల్లర్ లు ఈ విషయంలో పోలిటికల్ ప్రేషర్ చేస్తున్నట్లు తెలిసింది. కామారెడ్డి జిల్లాలో ఇఫ్పటికే సీయంఆర్ రికవరి కోసం జిల్లా కలెక్టర్ ఓత్తిడి తెస్తున్న అక్కడి మిల్లర్లు ఇప్పటికి ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. అక్కడ కుడా మిల్లర్లను డిపాల్టర్ లుగా ప్రకటించి రెవిన్యూ రికవరి యాక్టుకోసం జిల్లా కలెక్టర్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లాలో సీయంఆర్ రికవరి కోసం తీవ్ర కసరత్తు జరుగుతుంటే నిజామాబాద్ జిల్లాలో సీయంఆర్ విషయంలో బ్లాక్ లీస్టులో ఉన్న మిల్లర్లను అ జాబితాలోనుంచి తోలిగించేందుకు ప్రయత్నాలు జరుగడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కోత్త విదానం ప్రకటించేవరకు బ్లాక్ లీస్టులో ఉన్నవారిని తోలిగిస్తారో లేకపోతే ఉంచుతారో వేచి చూడాలి.