బాల్కొండ, బతుకమ్మ : మండల కేంద్రంలోని మహతి ఆశ్రమంలో స్థానిక బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు సెవెళ్ల మహేందర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నదానం నిర్వహించి, ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి తాగారు. మహతి గోశాల కు ఆర్థిక సహాయం అందించారు. వీరికి మహతి ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు అంబటి నవీన్, బీజేవైఎం మండల అధ్యక్షులు జక్కం శ్రీకాంత్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, ముప్కాల్ బీజేవైఎం మండల ప్రధానకార్యదర్శి మనోజ్ ,శేఖర్, వేంపల్లి రాకేష్, బీజేపీ నాయకులు తోట నవీన్, ఉట్నూర్ రాంకిషన్, తోట నాగేష్, మనోజ్, మహతి ఆశ్రమ నిర్వాహకులు నరేష్,తదితరులున్నారు.