రాష్ట్ర గవర్నర్ ను కలిసిన బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవ నికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద చర్చించారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని, బాలికల వసతి గృహం, ఆడిటోరియం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్,ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కళాశాల విలీనం తదితరుల విషయాలపై చర్చించారు.