Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:08 pm Posted by : ramakrishna

బీజేపీ మున్సిపల్ ముట్టడి ఉద్రిక్తం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

డివిజన్ లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, కార్పొరేటర్లు సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి లు మాట్లాడుతూ నగరంలోని 60 డివిజన్ లలో మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డివిజన్ లో సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్పొరేటర్లు ఒక్కసారిగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించారు. సమస్యలు పరిష్కారమయ్యేంత కదిలేది లేదని మున్సిపల్ కార్యాలయం ఎదుట బైటాయించారు.