. . . ఎస్సీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్
. . . బీజేపీ రాజకీయ వైఖరి సిగ్గుచేటు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఎస్సీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని మల్యాల గోవర్ధన్ అన్నారు. టీఎమ్ ఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, ఎస్సీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో బుధవారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ క్లబ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ చౌరస్తాలో బిజెపి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సంఘాల ఐక్యవేదిక నాయకులు పులి జైపాల్, మల్యాల గోవర్ధన్, బంగారు సాయిలు, షేక్ హుస్సేన్, మల్లని శివ మాదిగ మాట్లాడుతూ ఎస్సీల పట్ల బిజెపి వైఖరి మరో మారు బయటపడిందని, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేవలం ఎస్సీ డివిజన్ లు 39, 40, 44 లలో రిజర్వేషన్లను సవాలు చేస్తూ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పట్ల దళితుల పట్ల బిజెపి వైఖరి మరో మారు బయటపడిందనన్నారు. 60 డివిజన్ లలో రిజర్వేషన్లపై పిటిషన్ వేయాల్సిన వారు, వారి రాజకీయ లబ్ధి కోసం కేవలం ఎస్సీ డివిజన్ల పై వేసి ఎస్సీలను రాజకీయ బలి పశువులుగా చేస్తున్నారని, ఎస్సీల జోలికి వస్తే బిజెపి కి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. బిజెపి మన పట్ల వ్యవహరిస్తున్న తీరును పసిగట్టి బిజెపి అభ్యర్థులను రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని, వారిని ఓడించడమే మన ఎస్సీల ఐక్యతకు నిదర్శనం అని పిలుపునిచ్చారు. ఈ వైఖరికి నిరసనగా రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ, మహిళా నాయకులు బంటు జ్యోతి, మాల మహానాడు నాయకులు వినయ్, దండు చంద్రశేఖర్, నీలగిరి రాజు, చందు, చంద్రకాంత్, రాజయ్య, భీమ్ ఆర్మీ అధ్యక్షులు అజయ్, జమాతే ఇస్లామీ హింద్ నాయకులు హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.