ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ బిజెపి మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ అధ్యక్షతన మోర్తాడ్ మండల కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం ప్రతి పోలింగ్ బూత్ కేంద్రాలలో పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. బిజెపి అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందని నాటి నుండి నేటి వరకు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్  నినాదంతో కార్యకర్త...