Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 April 2025, 5:44 pm Posted by : ramakrishna

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ బిజెపి మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ అధ్యక్షతన మోర్తాడ్ మండల కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం ప్రతి పోలింగ్ బూత్ కేంద్రాలలో పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. బిజెపి అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందని నాటి నుండి నేటి వరకు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్  నినాదంతో కార్యకర్త పనిచేస్తూ ముందుకు వెళుతూ అంత్యోదయ సిద్ధాంతం, ఏకాత్మా మానవతా సిద్ధాంతం ఆధారంగా  పార్టీ రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమై  ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ప్రజల మద్దతుతో ఎదిగిందిని గుర్తు చేశారు. అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం  విశ్వ గురువు స్థానానికి చేరిందని భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా పార్టీ కోసం తమ జీవితాలను త్యాగం చేసి కార్యకర్తలను నాయకులు వారి త్యాగాలను  స్మరించుకుంటూ, భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా చేస్తున్నందుకు మేమందరం గర్వంగా భావిస్తూ ఇప్పటివరకు పని చేసి వారి జీవితాలను త్యాగం చేసిన కార్యకర్తలందరికీ పార్టీలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మోర్తాడ్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది.  కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భోగదేవేందర్ కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శి ఎలేటి సాయన్న, సీనియర్ నాయకులు లింగాల రాము గౌడ్,  మాజీ ఎంపిటిసి మురళి గౌడ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కోరం ప్రకాష్  సీనియర్ నాయకులు శివానంద్, గంగ మోహన్, భావాల నరసయ్య,  దేవేందర్, సాగర్, శేఖర్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

BJP's foundation day celebrated in grand style