. . . కామారెడ్డి సమావేశంలో శాసనసభ పక్షం తీర్మానం
కామారెడ్డి, బతుకమ్మ :
తెలంగాణ లో వ్యవసాయ సంక్షోభానికి రేవంత్ సర్కార్ కారణమని బిజెపి శాసనసభాపక్షం తీర్మానించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో బి జె ఎల్ పి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కె.వి.ఆర్ క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండించారు. బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ లతో పాటు ఎమ్మెల్యే లు హరీష్ బాబు, ధన్ పాల్ సూర్య నారాయణ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న శాసనసభ సమావేశాల్లో ప్రశ్నించడానికి సిద్దమయ్యారు. అందులో భాగంగా జిల్లాలో పర్యటన చేయాలని బిజెపి నాయకులు సిద్దమయ్యారు. ఈనెల 7 నుంచి అదిలాబాద్ జిల్లా నుంచి క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఎక్కు పెట్టాలని బిజెపి శాసనసభ పక్షం ప్లాన్ వేసింది.