Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 4:35 pm Posted by : ramakrishna

బీజేపీ కుట్ర పూరిత చర్యలు

  • ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై అక్రమంగా ఛార్జ్ షీట్ బీజేపీ కుట్ర పూరిత చర్యలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఈడీ కేసులు పెట్టి చార్జిషీట్ నమోదు చేసినందుకు నిరసనగా గురువారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్ , ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటూ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ పరిపాలన చేస్తున్నాడని అన్నారు. అదేవిధంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి పేద వాడిని ఎకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నాడని

BJP's conspiratorial actions

వీటన్నింటి పైన రాహుల్ గాంధీ ప్రజాక్షేత్రంలో గానీ పార్లమెంటులో గాని ఎల్లప్పుడు బిజెపిని ప్రశ్నిస్తూనే ఉన్నాడని అన్నారు. కుట్రపూరితంగా రాహుల్ గాంధీ ప్రశ్నించే గొంతుకను కట్టివేయాలని అక్రమంగా ఈడీ కేసులు పెట్టించి చార్జిషీట్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇది కేవలం బిజెపి కుట్రపూరిత చర్యకు నిదర్శనమని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం ఒకపక్క రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తూనే మరో ప్రక్క పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ని అవమానించిందని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ ఏ చర్యలు తీసుకోవడం లేదు అని ఆయన అన్నారు. బిజెపి చేస్తున్న అప్రజా స్వామిక పనుల వల్లనే పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు తగ్గాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి ఓటమిపాలు అవ్వడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రధానిగా రాహుల్ గాంధీ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తారని, బిజెపి చేస్తున్న కుట్రపూరిత చర్యలు ఇకనైనా మానుకోవాలని లేని పక్షాన దేశ ప్రజలంతా తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని వేణు రాజేష్ హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుమన్, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షులు రేవతి, ఫిషర్మెన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పూల ఉష, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బింగి మధుసూదన్, డిసిసి డెలిగేట్ లవంగ ప్రమోద్,రాజ్ గగన్, కౌశిక్, హరీష్, మలేక బేగం ,ఆడే ప్రవీణ్ కుమార్ మరియు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

BJP's conspiratorial actions